ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల కౌసర్ బ్రెడ్ తయారీ కంపెనీ సందర్శన
జమ్మికుంట మార్చి 12( ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట విద్యార్థులు వ్యవస్థాపక అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో స్థానిక కౌ సర్ బ్రెడ్ తయారీ కంపెనీని సందర్శించారు. కంపెనీ స్థాపించడానికి అయిన పెట్టుబడి వ్యయమును, బ్రెడ్ మేకింగ్ తయారీ విధానం ను, మార్కెటింగ్ మెలకువలను విద్యార్థులు తెలుసుకున్నారు. యువత స్వయం ఉపాధి ద్వారా ఇటువంటి చిన్న తరహా, కుటీర పరిశ్రమలను స్థాపించడం ద్వారా తాను ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధిని కల్పించవచ్చని ఈ సందర్భంగా తయారీదారు ఫారుక్ తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో వ్యవస్థాపక అభివృద్ధి విభాగం సమన్వయకర్త డాక్టర్ కే రాజేంద్రo, అధ్యాపకులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్, దీన, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




