ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం
డయాలసిస్ రోగి కుటుంబంపై దాడి..
బండరాయితో దాడి చేశారు అంటూ సిబ్బందిపై సంచలన పిర్యాదు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల భద్రత ఎక్కడ?
సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో ఉద్రిక్తత.
రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కోసం వచ్చిన రోగి కుటుంబ సభ్యులపై ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడటమే కాకుండా, పెద్ద బండరాయితో కొట్టేందుకు కూడా యత్నించారంటూ బాధిత కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన దేవరాజు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా డయాలసిస్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
డయాలసిస్ సెంటర్‌లో పేరు నమోదు చేసుకునే సమయంలో సిబ్బందితో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుందని, అనంతరం కొందరు సిబ్బంది తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దాడి సమయంలో పెద్ద బండరాయి ఎత్తి తమపై వేయాలని ప్రయత్నించారని, ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకున్నామని తెలిపారు.ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి కుటుంబ సభ్యుల భద్రతకే ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం
డయాలసిస్ రోగి కుటుంబంపై దాడిబండరాయితో దాడి చేశారు అంటూ సిబ్బందిపై సంచలన పిర్యాదు
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల భద్రత ఎక్కడ
RELATED ARTICLES




