📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదు...

ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదు : జిల్లా కలెక్టర్ కే. హైమవతి

📰 Generate e-Paper Clip

 

 

ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు.

సిద్దిపేట్, మార్చి 13, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా  కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular