కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)బద్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపే ఉద్దేశంతో బద్వేల్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది.బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కె.రితేష్ రెడ్డి,మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కె.విజయమ్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి అర్జీదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ప్రజలు తమ సాగునీరు,తాగునీరు,పెన్షన్లు మరియు ఇతర వ్యక్తిగత సమస్యలపై సమర్పించిన వినతి పత్రాలను రితేష్ రెడ్డి గారు స్వయంగా స్వీకరించి,వినతిదారుల విన్నపాలను ఓపికగా విన్నారు.వినతులు స్వీకరించిన అనంతరం రితేష్ రెడ్డి గారు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి,కొన్ని ముఖ్యమైన సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.అర్జీదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ప్రతి ఒక్కరికీ చట్టబద్ధంగా న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,పార్టీ శ్రేణులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు,క్లస్టర్,యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జ్‌లు పాల్గొని ప్రజల సమస్యల సేకరణలో చురుగ్గా వ్యవహరించారుఇట్లు,బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం.
Homeఆంధ్రప్రదేశ్ప్రజా సమస్యల పరిష్కారమే మా బాధ్యత: ప్రజా దర్బార్‌లో అర్జీదారులకు భరోసా కల్పించిన శ్రీ కె....
ప్రజా సమస్యల పరిష్కారమే మా బాధ్యత: ప్రజా దర్బార్‌లో అర్జీదారులకు భరోసా కల్పించిన శ్రీ కె. రితేష్ రెడ్డి
0
20
RELATED ARTICLES
- Advertisment -




