ప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)రాజంపేట పట్టణం ప్రజా సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం -తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.మెగా ఉచిత కంటి శిబిరం విజయవంతం చేద్దాం – పార్టీ శ్రేణులకు చమర్తి పిలుపు పార్టీతోపాటు ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలి రాజంపేట పట్టణం నియోజకవర్గ పార్టీ కార్యాలయం రాజంపేట.పార్టీతోపాటు కార్యకర్తలు ప్రజా ఆరోగ్యం పై కూడా దృష్టి సారించాలని,రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలకు మంచి ఆరోగ్యం అందించేలా అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయబోతున్నామని, అందులో భాగంగా 16వ తేదీ రాజంపేటలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేలా కార్యకర్తలు గ్రామ గ్రామాన కంటి సమస్యలు ఉన్నవారిని ఉచితంగా వైద్యం పొందేలా చర్యలు తీసుకోవాలని, స్వచ్ఛంద సంస్థలు, టిడిపి కార్యకర్తలు తలచుకుంటే మనం చేసే మంచి పని ప్రజలందరికీ ఉపయోగపడుతుందని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు.కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని/ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాధాన్యత ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.శుక్రవారం నాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో పార్టీ సమీక్షా సమావేశాన్ని శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.అదేవిధంగా చమర్తి మాట్లాడుతూ ఆరోగ్య రాజంపేటే లక్ష్యంగా ఈనెల 16 వ తేదీన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చమర్తి జగన్ మోహన్ రాజు గారు ప్రజలకు పిలుపునిచ్చారు.అనంతరం కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు గురించి ప్రజలకు వివరించాలని చమర్తి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.అంతకముందు దివ్యాంగులు చమర్తిని మర్యాదపూర్వకంగా కలవగా వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని,వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంట్ని యోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,క్లస్టర్,యూనిట్,గ్రామ,బూత్ స్థాయి నాయకులు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం;;చమర్తి జగన్ మోహన్ రాజు
0
7
RELATED ARTICLES
- Advertisment -




