📄 ePaper
Friday, April 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజా పాలన ప్రతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు...

ప్రజా పాలన ప్రతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు అలైవ్ అరైవ్ పేరుతో రహదారి భద్రత కార్యక్రమం-జిల్లా కలెక్టర్ కె హేమావతి, సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, ఏప్రిల్ 9 ప్రజావాణి

ప్రజా పాలన ప్రతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు అలైవ్ అరైవ్ పేరుతో రహదారి భద్రత కార్యక్రమం నిర్వహించి ప్రజలలో రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కె హేమావతి, సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డిజిపి శివధర్ రెడ్డి,  రవాణా, వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి రహదారి ప్రమాదాలు తగ్గించేలా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు గ్రామాలు, పట్టణాలు , విద్యాసంస్థలు, రోడ్డు సైడ్ గ్రామాలు, అధికంగా రహదారి ప్రమాదాలు జరిగే గ్రామాల వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అలాగే రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులను రక్షించేందుకు చేయవలసిన వైద్య సహాయం తదితర అంశాలపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. అలాగే 13వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో మరియు మున్సిపల్ వార్డులలో ప్రత్యేకంగా రహదారి భద్రత అవగాహన కొరకు ప్రత్యేక గ్రామసభలు మరియు వార్డు సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. హేమవతి మాట్లాడుతూ .. ప్రభుత్వ ఆదేశాల మేరకు 13వ తేదీన రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయతీలలో మరియు మున్సిపల్ వార్డులలో ప్రత్యేక సభలు నిర్వహించి గ్రామపంచాయతీలో 8 నుండి 9 మంది సభ్యులతో కూడిన రహదారి భద్రత కమిటీని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద వాహనదారులను హెచ్చరిస్తూ, అప్రమత్తం చేస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని, వైద్య ఆరోగ్యశాఖ వారి ద్వారా బ్లాక్ స్పాట్లు అధికంగా గల ఆయా గ్రామాల రోడ్ సైడ్ ప్రజలకు వివిధ షాపుల వారికి సిపిఆర్ నిర్వహించడం మరియు ఫస్ట్ ఎయిడ్ నిర్వహించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగేలా వివిధ కాంపిటీషన్లను నిర్వహిస్తామని, బహుమతులను అందజేస్తామని తెలిపారు. 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయా కార్యక్రమాలలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయిస్తామని తెలిపారు. అదేవిధంగా 13 నుంచి 18 వ తారీకు వరకు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తామని, స్కూల్ జోన్లలో వాహనదారుల రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ 500 మంది బస్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, స్కూల్ బస్సులు ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామని, ప్రధాన రహదారులపై జంక్షన్లు మరియు ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ దశరథ్, డిపిఓ రవీందర్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంవిఐ శంకర్ నారాయణ, ఆర్ అండ్ బి శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు…

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular