ప్రజావాణి న్యూస్ (మార్చి 11) ప్రజా ఉద్యమాల విరాళాల సేకరణ”ఆదరించి సహకరించండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దుల్లపల్లి.బాలు గడప గడపకు సిపిఐ పేరుతో రాష్ట్ర పిలుపులో భాగంగా ప్రజా ఉద్యమాల కోసం విరాళాల సేకరణ చేపట్టామని ఈరోజు మార్తమ నగర్ జంగాల కాలనీ శివానగర్ తదితర కాలనీలలో చేపట్టామని.గడపగడపకు సిపిఐ విరాళాల ప్రజా సంక్షేమం, హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం ఉద్యమిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోప్రజా సమస్యలపై పోరాటాలు, అక్రమాలపై ఉద్యమాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమన్నారు.ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, బలహీన వర్గాల పై దాడులు,పేదల ఇళ్ల కూల్చివేతలు, ఆకాశానంటుతున్న ధరలు, ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలపై పోరాటాలు కొనసాగించేందుకు ప్రజల నుండి స్వచ్ఛంద విరాళాలు సేకరిస్తున్నామన్నారు.ప్రజలే ఉద్యమాల బలం అని, చిన్న మొత్తమైనా విరాళంగా ఇచ్చి ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలన్నారు. ప్రజా ఉద్యమాలు ప్రజల డబ్బుతోనే నడుస్తాయన్నారు.అక్రమ కూల్చివేతలు, భూ ఆక్రమణలపై పోరాటం,కార్మిక, కర్షక, రైతు, బహుజనల హక్కుల పరిరక్షణ, యువత ఉపాధి – నిరుద్యోగంపై ఉద్యమం,ధరల పెరుగుదల, ప్రజా సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటాలకు చేపడుతామన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరా సహాయ కార్యదర్శి ఇమ్మానుయేల్ జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ. పెంచలయ్య.ఏరియా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బయ్య పట్టణ నాయకులు మునిరత్నం వెంకటేష్ మూరాలచ్చుమ్మ వెంకటరమణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రజల డబ్బుతో ప్రజా ఉద్యమం.గడప గడపకు సి.పి.ఐ
0
6
RELATED ARTICLES


