📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyపెండింగ్ ఫీజుల విడుదలకు టిఎల్ఎఫ్ వినతి పత్రం బకాయిలు చెల్లించకపోతే ‘చాక్ డౌన్’ హెచ్చరిక

పెండింగ్ ఫీజుల విడుదలకు టిఎల్ఎఫ్ వినతి పత్రం బకాయిలు చెల్లించకపోతే ‘చాక్ డౌన్’ హెచ్చరిక

📰 Generate e-Paper Clip

పెండింగ్ ఫీజుల విడుదలకు టిఎల్ఎఫ్ వినతి పత్రం

బకాయిలు చెల్లించకపోతే ‘చాక్ డౌన్’ హెచ్చరిక

ప్రజావాణి | కామారెడ్డి జిల్లా ప్రతినిధి | మార్చి 16

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లెక్చరర్ల ఫోరం (టిఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా టిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹8 వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల వివిధ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు నెలల తరబడి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బకాయిలను విడుదల చేసి అధ్యాపకులు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తోందని విమర్శించిన ఆయన, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేసి తన నిబద్ధతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాపకులందరూ కలిసి ‘చాక్ డౌన్’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్, బాల్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular