కడప జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)ప్రొద్దుటూరు పశువుల పొట్టలో.కల్తీ.చిచ్చు.ప్రొద్దుటూరు ఎస్టేట్‌లో మృత్యువ్యాపారం.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారూ.మూగజీవాల.మరణ శాసనాన్ని.ఆపండి.రాయలసీమ గడ్డ మీద మంచితనానికి ఎంత విలువుందో,మోసానికి అంత శిక్ష ఉండాలి.కానీ,ప్రొద్దుటూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సాక్షిగా చట్టం చచ్చి పడిందా.అన్న అనుమానం కలుగుతోంది.చట్టానికి కళ్ళు లేవు.న్యాయానికి ఇల్లు లేదు అన్న సామెతను ఇక్కడి కల్తీ వ్యాపారులు అక్షరాలా నిజం చేస్తున్నారు.నోరు లేని మూగజీవాలను పొట్టనబెట్టుకుంటూ,రక్తం తాగే రాక్షసుల్లా తయారయ్యారు కొందరు కేటుగాళ్ళు.తౌడు కాదు.అది మృత్యు పిండి.రైతుకు కన్నబిడ్డలాంటి పశువులకు పెట్టే తౌడులో విషం కలుపుతున్నారు.కేవలం కాసుల కక్కుర్తి కోసం తౌడులో ఇసుకను,రంపపు పొట్టును,ప్రమాదకరమైన శుద్ధ పిండిని కలిపి మాయాజాలం చేస్తున్నారు.ఆ కల్తీ మేత తిన్న పాపానికి.పాలివ్వాల్సిన ఆవులు,గర్భిణీ గేదెలు కడుపుబ్బి,పేగులు మెలికలు తిరిగి కళ్లముందే విలవిల్లాడుతున్నాయి.ఆ పసవేశ్వరుల కడుపులు విషతుల్యం అవుతుంటే,ఆ మూగజీవాల కళ్లలో నీళ్లు చూస్తుంటే గుండె తడి ఉన్న ఏ మనిషైనా చలించిపోవాల్సిందే.కానీ ఇక్కడి అధికారుల తోలు మందమైందా.లేక కల్తీ దొరల నోట్ల కట్టలకు కళ్లు మూసుకుపోయాయా.అధికారులారా.మీ నిద్ర ఎప్పుడు వదులుతుంది.?టీడీపీ ప్రభుత్వ పెద్దలకు మొత్తుకున్నా ఫలితం లేదు.అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరం లేదు.ఎన్ని పత్రికల్లో వార్తలు వచ్చినా,ఎంతమంది మొత్తుకున్నా.అంతా మాకే తెలుసు.అన్నట్టు మిన్నకుండటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి.దొంగలు దొరల్లాగా తిరుగుతుంటే,చట్టం వారి చుట్టంలాగా మారిందా.అధికారుల అండదండలు లేకుండానే ఇంత బహిరంగంగా మూగజీవాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.పవన్ కళ్యాణ్ సారూ.మీరు నిలదీయాల్సిందే.అయ్యా పవన్ కళ్యాణ్ గారూ.మీరు అన్యాయాన్ని ఎదిరించే సింహం.మా ప్రొద్దుటూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో జరుగుతున్న ఈ ఘోరమైన మారణహోమాన్ని ఒక్కసారి చూడండి సారూ.మూగజీవాల ఆర్తనాదాలు మీ చెవిన పడటం లేదా.నోరు లేని జీవాల ఉసురు తగిలితే ఏ రాజ్యమైనా కుప్పకూలాల్సిందే.అధికారులకు ఆదేశాలివ్వండి సారూ.ఈ కల్తీ కేటుగాళ్ల గుండెల్లో వణుకు పుట్టేలా చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పండి.తౌడు పేరుతో చావును అమ్ముతున్న ఈ మాయగాళ్లను జైలు ఊచల వెనక్కి నెట్టండి.పశుపోషకుల ఆవేదన,మూగజీవాల దాహం.రెండూ ఇక్కడ అగమ్యగోచరంగా మారాయి.మీరు స్పందించి,ఈ కల్తీ మాయాజాలాన్ని అరికట్టి,ఆ పాపాత్ములకు ఉరితాడు బిగిస్తేనే ఈ ప్రొద్దుటూరు గడ్డపై న్యాయం బ్రతికి ఉన్నట్టు లెక్క.బాధితుల తరపున, ఒక ఆవేదనతో కూడిన కలం పోరాటం.
పశువుల పొట్టలో..కల్తీ..చిచ్చు.. ప్రొద్దుటూరు ఎస్టేట్‌లో మృత్యువ్యాపారం
0
12
- Advertisment -



