పలు వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మన ప్రజావాణి
చౌడేపల్లి మర్చి 11
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో నిర్వహించిన పలు వివాహాది శుభకార్యక్రమాల్లో మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న శుభకార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
చౌడేపల్లికి చెందిన తౌడ హరిబాబు కుమారుని వివాహ కార్యక్రమం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ పెద్దల ఆశీస్సులతో దంపతులు సంతోషంగా జీవించాలని సూచించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమానికి విచ్చేస్తున్నారని తెలుసుకున్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను కలుసుకుని అభివాదం చేశారు. కార్యక్రమం సందడి వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు గాంచారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు జి. నాగభూషణరెడ్డి, దామోదర్ రాజు, రుక్మిణమ్మ, వెంకటరమణ, వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, కళ్యాణ్ భరత్, అంజిబాబు, నరసింహులు యాదవ్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కర్యక్రమం అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడికి వచ్చిన అభిమానులు, నాయకులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.





