ప్రజావాణిన్యూస్(మార్చి10)కడప,పరిపాలనా సౌలభ్యంలో భాగంగా జిల్లా రెవెన్యూ శాఖలో పలువురు డిప్యూటీ తహశీల్దార్లకు తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వై.ఎస్.ఆర్.కడప జిల్లాలో తహసీల్దార్ పోస్టులను అధికారికంగా భర్తీ చేయడానికి పరిపాలనా అవసరం ఏర్పడడంతో.జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్ల సీనియారిటీ జాబితా మేరకు అర్హులైన డిప్యూటీ తహసీల్దార్లను తాత్కాలికంగా (అడ్‌హాక్) తహసీల్దార్‌లుగా ప్రమోట్ చేయాలని నిర్ణయించడ జరిగిందన్నారు.ఈ పదోన్నతులు ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్,1996 యొక్క రూల్-10 ప్రకారం ఇవ్వబడ్డాయన్నారు,పదోన్నతి పొందిన ఈ అధికారులు తమ జీతం మరియు అలవెన్సులను డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్‌లోనే పొందుతారని,ప్రమోషన్ పోస్టులో జీతం ఫిక్సేషన్‌కు అర్హులు కారనే విషయాన్ని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.పదోన్నతులు పొందిన అధికారులు మరియు వారి పోస్టింగ్ వివరాలు.1శ్రీమతి ఎ.శివ లక్ష్మి డిప్యూటీ తహసీల్దార్,వెంపల్లి (అడ్‌హాక్ ప్రమోషన్) తహసీల్దార్, నందలూరు (వైస్ జి.అమరేశ్వరి బదిలీ).2.శ్రీమతి పి.విజయ కుమారి స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్, టిజిపి యూనిట్-II,కడప(అడ్‌హాక్ ప్రమోషన్) తహసీల్దార్,చెన్నూరు(వైస్ టి.సరస్వతి బదిలీ).3. శ్రీ ఏ.పి.లక్ష్మి నారాయణ డిప్యూటీ తహసీల్దార్,కెఆర్‌ఆర్‌సి,కలెక్టరేట్,కడప(అడ్‌హాక్ ప్రమోషన్) → తహసీల్దార్,కడప అర్బన్ (ఖాళీగా ఉన్న పోస్టులో మరియు ఎన్‌హెచ్‌ఏఐ సెక్షన్‌లో డిప్యూటేషన్).4. శ్రీమతి జె.లక్ష్ముమ్మ డిప్యూటీ తహసీల్దార్,వల్లూరు (అడ్‌హాక్ ప్రమోషన్) తహసీల్దార్,టి.సుందుపల్లి (వైస్ ఎస్.మహబూబ్ చంద్ బదిలీ).5)శ్రీ వి.షఫీ ,డిప్యూటీ తహసీల్దార్ & ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌ఛార్జ్,ముద్దనూరు,కడప తహసీల్దార్,మైలవరం (వైస్ ఎం.లక్ష్మి నారాయణ బదిలీ) 6)శ్రీమతి బి. అనురాధ డిప్యూటీ తహసీల్దార్ & ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌ఛార్జ్,కమలాపురం,కడప పోస్టింగ్ తరువాత జారీ చేయబడుతుంది.7) శ్రీ పి.ఎం.వి.మనోజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్,కడప తహసీల్దార్,బి.కోడూరు (వైస్ యు. దస్తగిరయ్య బదిలీ).అలాగే.కడప జిల్లా ప్రత్యేక ఉప కలెక్టర్త హసీల్దార్ మరియు జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్, ఏపీఎస్‌సీఎస్‌సీ లిమిటెడ్, కడప వారి నియంత్రణలో ఉన్న వ్యక్తులను వారి కొత్త పోస్టింగ్‌లో చేరేందుకు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తాత్కాలిక ప్రమోషన్‌గా తహసీల్దార్‌గా,అన్నమయ్య జిల్లాకు అదోక్ ప్రాతిపదికన శ్రీ బి. రెడ్డెన్న, డిప్యూటీ తహసీల్దార్, ఎల్.ఆర్.పల్లి,అన్నమయ్య జిల్లా,అన్నమయ్య జిల్లాకు కేటాయించబడ్డారు.అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఈ వ్యక్తిని విడుదల చేసి,తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చి,వ్యక్తి యొక్క జాయినింగ్ వివరాలను ఈ కార్యాలయానికి పంపమని అభ్యర్థించారు.ఈ నియామకం పూర్తిగా తాత్కాలికమైనదని మరియు సీనియారిటీపై ఎటువంటి హక్కును ఇవ్వదన్నారు.మరియు తహసీల్దార్ కేడర్‌లో సీసీఎల్ఏ ద్వారా అభ్యర్థులను కేటాయించినప్పుడు ఎటువంటి నోటీసు/కారణం లేకుండా ఎప్పుడైనా రద్దు చేయబడవచ్చనే విషయాన్ని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
పలువురు డిప్యూటీ తహశీల్దార్లకు తాత్కాలిక పదోన్నతులు..!!
0
13




