పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడుకోలు సభ.
ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ అనిల్ కుమార్.
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి మార్చ్ 06
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామంలొ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఘనంగా ఎంఈఓ తిరుపతయ్య, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ…. పరీక్ష సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని అన్నారు. పరీక్షల్లో 100 ఉత్తీర్ణత ర్యాంకు సాధించి జిల్లాలోని మంచిర్యాంకులు సాధించాలని విద్యార్థి విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలు బాగా రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థి విద్యార్థులకు సూచించారు. పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఉత్సాహం ఇచ్చారు. క్రమశిక్షణతో పాటు చదువు చదివితే తప్పకుండా మంచి మార్కులు సాధిస్తారని సలహా సూచనలు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తన భవిష్యత్తు కు మొట్టమొదటి అడుగు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఎంఈఓ తిరుపతయ్య, గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రమేష్ , వార్డ్ సభ్యులు శంకర్, చందర్, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.




