*పదవి ఒకరిది… పెత్తనం మరొకరి*
••••నేనే సర్పంచ్ ని ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సర్పంచ్ భర్త వెక్కిరి సమాధానం.
•••తేరా వెనుక ఉండి నడిపించాల్సింది పోయి తేరా ముందుకు వస్తున్న వైనం.
•••ఇలా బహిరంగంగా రాజ్యాంగ ఉల్లాంఘనకు పాల్పడిన ఘనుడు.
•••మహిళా సాధికారిత రిజర్వేషన్ లు కల్పించడం ఎందుకని ప్రజల ఆగ్రహం.
•••నర్సింహాపల్లి గ్రామ పంచాయతీ పరిస్థితి.
*తంగళ్ళపల్లి ప్రజావాణి* పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది అన్నచందాన తయారైంది తంగళ్లపెల్లి మండలంలో పరిస్థితి. ఇందుకు తాజాగా జరిగిన ఓ సమావేశమే ఉదాహరణ. మండలంలోని నర్సింహాలపల్లి పంచాయతీలో శుక్రవారం రోజు పంచాయతీ ఆవరణలో గ్రామ సభ ద్వారా చేపట్టాల్సిన పనుల నిమిత్తం సమావేశం ఏర్పాటైంది. సభాధ్యక్ష స్థానంలో సర్పంచ్ చెక్కపెల్లి శరణ్య ఉన్నారు. కానీ ఆమెకు మాట్లాడే అవకాశం లేకపోయింది. ఆమె భర్త చెక్కపెల్లి లింగారెడ్డి ఆమె పక్కనే కూర్చొని సర్వం తానై నడిపించారు. ఇది చూసినవారు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అధికారిక కార్యక్రమాల్లోనూ వారికన్నా, వారి కుటుంబ సభ్యులే చక్రం తిప్పుతున్నారు. మహిళలకు రాజకీయ అనుభవం అంతగా ఉండదు కనుక తెరవెనుక ఉండి ఆమెను నడిపించాలే తప్ప, ఇలా బహిరంగంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అధికారుల పాత్ర తక్కువేం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు, అధికారిక కార్యక్రమాలకు ఇటువంటి సూపర్ సర్పంచ్‌లు వస్తే వారే రెడ్ కార్పేట్ పరుస్తుండడం విశేషం. ఈ తతంగాన్ని చూసినవారంతా ఈ మాత్రం దానికే మహిళా సాధికారిత, మహిళలకు రిజర్వేషన్లు, పెద్ద పీట అనే పెద్దపెద్ద పదాలను పాలకులు తరచూ వాడడం ఎందుకని పలువురు ఆక్షేపిస్తున్నారు.




