📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నారాయణ విద్యా సంస్థ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి,,డివైఎఫ్ఐ;డిమాండ్

నారాయణ విద్యా సంస్థ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి,,డివైఎఫ్ఐ;డిమాండ్

📰 Generate e-Paper Clip

కడపజిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్13)కడపనగరలోప్రైవేటు ఉపాధ్యాయులను వేధిస్తున్న నారాయణ విద్యా సంస్థ పై కేసు నమోదు చేయాలి.జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్.ప్రైవేటు ఉపాధ్యాయులను వేధిస్తున్న నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేసారు.సోమవారం నాడు కడప లో కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ కలెక్టర్ జ్యోతి కి వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలలో ప్రైవేటు ఉపాధ్యాయులను బానిసలుగా చూస్తున్నారని అన్నారు.మంచి చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు రాక ప్రైవేటు ఉపాధ్యాయుల వృత్తిలో చేరితే కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కువ జీతం ఆశ చూపి తీరా చేరిన తర్వాత వారికి అడ్మిషన్ లు టార్గెట్ విధిస్తూ వేధిస్తున్నారన్నారు.జిల్లా లో 45 డిగ్రీల ఎండలో టీచర్లను ఇంటింటికి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.రాను అని అన్నవారికి జీతాలు కట్ చేస్తూ ఇంక్రిమెంట్లు ఉండవని తర్వాత విద్యా సంవత్సరం రావద్దని చెబుతున్నారని అన్నారు.ఉద్యయిగా భద్రత లేక చేసిన అప్పుల కు తప్పని పరిస్థితులలో మనసు చంపుకొని చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని చెబుతుంటే కార్పొరేట్ నారాయణ విద్యా సంస్థ విద్యార్థులకు,ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వలేదన్నారు.విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద 12 నెలలకు ఫీజులు కట్టించుకొని 10 నెలలు మాత్రమే జీతాలు ఇస్తున్నారని అన్నారు.ప్రైవేటు ఉపాధ్యాయుల చేత ఓట్లు వేయించుకున్న ప్రజా ప్రతినిధులు వీరి సమస్యను గుర్తించాలని ప్రభుత్వం తో మాట్లాడి వీరి హక్కుల కోసం మాట్లాడాలన్నారు.నిరుద్యోగులు అయిన ప్రైవేటు ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.విద్యా శాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్నారు.వారిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన నిర్వహిస్తామని అన్నారు.కార్యక్రమంలో కడప నగర సహాయ కార్యదర్శి వంశీ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular