ప్రజావాణి న్యూస్ : గుడివాడ మార్చి 07 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నలంద స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గుడివాడ II టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె ఆర్ కె హనీష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కోసం వివిధ క్రీడా పోటీలు నిర్వహించగా, వాటిలో విజయం సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలలో సేవలందిస్తున్న సీనియర్ మహిళా ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా సీఐ జె ఆర్ కె హనీష్ మాట్లాడుతూ…, మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించి వారి హక్కులు మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థినులు చదువులోనూ, క్రీడలలోనూ ముందుకు రావాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
నలంద స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
0
25
RELATED ARTICLES
- Advertisment -




