ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
జిల్లా డిఎస్పి రఘు చందర్
ధర్మపురి పట్టణం లో పోలీసు వారి ఫ్లాగ్ మార్చ్
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి ఫిబ్రవరి 08(ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ లో నిర్వహిస్తున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ధర్మపురి మున్సిపాలిటీలో ఈ నెల 11 న జరిగే ఎన్నికలలో ఎలాంటి అవంచనీయా మైన సంఘటనలు జరగకుండా, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పి రఘు చందర్, ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలపాటి రాం నర్సింహారెడ్డి ల ఆధ్వర్యంలో ధర్మపురి సర్కిల్ పోలీస్ సిబ్బంది తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ… ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా, ప్రజలకు అభ్యర్థులకు తెలియజేశారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎస్సైలు జి మహేష్, రవీందర్, వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్, బుగ్గారం ఎస్సై సతీష్, గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగింది.




