📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దేశ స్వాతంత్ర్య పోరాట యోధుడు, యువతకు ఆదర్శప్రాయుడు భగత్ సింగ్. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి...

దేశ స్వాతంత్ర్య పోరాట యోధుడు, యువతకు ఆదర్శప్రాయుడు భగత్ సింగ్. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి23)కడప స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ భగత్ సింగ్ 95వ వర్ధంతినీ కడప నగరంలోని ప్రకాష్ నగర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహం నందు సోమవారం నాడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ నేటి విద్యార్థి,యువతకు భగత్ సింగ్ పోరాట జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు,అతి చిన్న వయసులో పోరాటాల వైపు ఆకర్షితులై దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గునపం గా మారి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన విప్లవ యువకిశోరం భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్ దేవ్ అని పేర్కొన్నారు,దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బ్రతకాలని లౌకికవాదం పరిరక్షించాలని దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం తీసుకురావాలని పోరాటాలు చేసిన భగత్ సింగ్ లాంటి పోరాట యోధుల ఆశయాలకు నీరుగార్చే విధంగా నేటి పాలకులు నీరుగార్చే విధంగా ఉందన్నారు దేశంలో NDA ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరిస్తూన్నారు రాజ్యాంగ విలువలను హరిస్తూ దేశవ్యాప్తంగా లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా అనేక కార్యకలాపాలు చేయడం ద్వారా స్వాతంత్ర సమరయోధులు యొక్క పోరాటాన్ని వారి త్యాగాలు వారు ఆశించిన స్వతంత్ర దేశం నేటి బిజెపి పాలకులు సర్వనాశనం చేస్తున్నారు.అలాగే బిజెపి అధికారంలో చేపడితే సంవత్సరానికి యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని దొంగ హామీలతో అధికారం చేపట్టి నేడు ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్ముతున్నారని బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి దేశంలోని విద్యార్థి,యువత ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ లాంటి పోరాట స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు,రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని పేర్కొన్నారు, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అడిగిన,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయమని అడిగిన పోరాటాలు చేసిన అక్రమ అరెస్టులతో,నిర్బంధాలతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు,విద్యార్థి,యువతను నమ్మించి మోసపూరితమైన ఎన్నికల హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి భగత్ సింగ్ లాంటి నాయకుల పోరాట స్ఫూర్తితో విద్యార్థి,యువత పోరాటాలకు నడం బిగించాలని మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అప్పుడే ఇలాంటి నాయకులకు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని పిలుపునిచ్చారు,ఈ రాష్ట్రం లో గంజాయి, డ్రగ్స్, వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యులు చారీ,నగర ఉపాధ్యక్షులు అఖిలేష్,కార్తీక్, శ్రీనివాసులు, హరిజన రాజు, నాయకులు భాస్కర్, అవినాష్, వీరేష్, ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular