📄 ePaper
Sunday, April 5, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarదేశంలో సామాజిక న్యాయం సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి...

దేశంలో సామాజిక న్యాయం సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హుజూరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

📰 Generate e-Paper Clip

జమ్మికుంట, ఏప్రిల్ 5 (ప్రజావాణి):

దేశంలో సామాజిక న్యాయం సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హుజూరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఆదివారం సైదాపూర్ క్రాస్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, దేశ రక్షణ, కార్మిక, వ్యవసాయ రంగాల్లో బాబు జగ్జీవన్ రామ్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆలోచనలు అభివృద్ధికి పునాదులు అయ్యాయని అన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందేలా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.

అలాగే, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular