📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దాతల సహాయం మరువలేనిది ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి

దాతల సహాయం మరువలేనిది ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మార్చి 11) మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ లో ఉన్న సెయింట్ పాల్ హై స్కూల్ నందు ఈరోజు కరస్పాండెంట్ ప్రధానోపాధ్యాయులు తిమోతి ప్రకాష్ జి బి సుధాకర్ లకు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటం అందించామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ టీచర్ బిఎస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు తెలిపారు.179వ వర్ధంతి ని పురస్కరించుకొని దాత చిలకల నిరంజన్ రెడ్డి వారి తండ్రి చిలకల రామలక్ష్మీరెడ్డి పేరుమీద గిద్దలూరు తాలూకాలోని ఉన్నత పాఠశాలలకు అందించడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించారని ఇలాంటి దాతల సహకారం మరువలేనిదని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు మన గిద్దలూరు ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల మీద విరోచితంగా పోరాడి వారిని ఎవరైనా కూడా తరుముకోవచ్చు ఇక తరమండని భారతీయులకు పిలుపునిచ్చారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యాన్ని నింపిన మొనగాడు కొదమ సింహం వీర సింహం ధైర్యశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చెప్పుకోవచ్చన్నారు అంత గొప్ప ధైర్యశాలి చిత్రపటాన్ని ప్రతి స్కూలుకు అందిస్తే ఆగస్టు 15 జనవరి 26 నరసింహారెడ్డి జయంతి వర్ధంతి సందర్భంగా అయినా విద్యార్థిని విద్యార్థులకు ధైర్య సాహసాలను సంబంధించినటువంటి నాలుగు మాటలు అయినా ఉపాధ్యాయుల ద్వారా తొందరగా సమాచారం వెళుతుందని మొదటగా ప్రతి ఉన్నత పాఠశాలకు గిద్దలూరు తాలూకాలో అందించాము రాబోవు రోజులలో బద్వేల్ తాలూకాలో ఉండే ఉన్నత పాఠశాలలు గిద్దలూరు లో ఉండే ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు రెసిడెన్షియల్ అన్ని ప్రభుత్వ ఆఫీసులో కూడా అందించాలనే సంకల్పంతో ఉన్నామని బి యస్ నారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సూరా రామచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పాలుగుల్ల సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular