📄 ePaper
Sunday, March 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే – 

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే – 

📰 Generate e-Paper Clip

దళిత హక్కుల పోరాట సమితి కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మర్చి 29)బద్వేల్ భారత  రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కును దళిత క్రైస్తవులకు వర్తింపజేయడంలో జరుగుతున్న చారిత్రక అన్యాయంపై దళిత హక్కుల పోరాట సమితి కడప జిల్లా అధ్యక్షులు నాగ దాసరి ఇమ్మానుయేలు సిపిఐ ఏరియా కార్యదర్శి మస్తాన్ పట్టణ కార్యదర్శి బాల ఓబయ్యలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక జేవీ భవన్ లో దళిత హక్కుల పోరాట సమితి బద్వేలు ఏరియా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష రాత్రికి రాత్రే మాయం కాదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కేవలం హిందూ దళితులకు మాత్రమే ఎస్సీ హోదాను పరిమితం చేశారు అని ఆ తర్వాత 1956లో సిక్కులకు, 1990 బౌద్ధులకు సవరణలు చేసి హోదా కల్పించిన ప్రభుత్వం క్రైస్తవ దళితులను విస్మరించడం ఆర్టికల్ 14 (సమానత్వం) మరియు ఆర్టికల్ 15 (వివక్ష రహితం) ఉల్లంఘనే అన్నారు. ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ) ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించినందుకు గాను, అతనికి రాజ్యాంగపరంగా అందాల్సిన సామాజిక రక్షణలను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. జి ఓ యం ఎస్ నం . 341 (సాంఘిక సంక్షేమ శాఖ) ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దళిత క్రైస్తవులను ‘బిసి-సి’ (BC-C) వర్గంగా గుర్తించారు. అయితే, వీరికి అందుతున్న 1% రిజర్వేషన్ వారి జనాభా ప్రాతిపదికన ఏమాత్రం సరిపోదని, వీరికి పూర్తిస్థాయి ఎస్సీ (SC) హోదా కల్పించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు​ దళిత క్రైస్తవ కుటుంబాలు నేటికీ సామాజికంగా వెలివేతకు గురవుతున్నాయి. వీరికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (ఎస్ సి/ఎస్ టి అట్రాసిటీ చట్టం) రక్షణ లేకపోవడం వల్ల దాడులు జరిగినప్పుడు న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికలో దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవుల పరిస్థితి ఇతర ఎస్సీల కంటే హీనంగా ఉందని, మతంతో సంబంధం లేకుండా వారికి ఎస్సీ హోదా ఇవ్వాలని సిఫార్సు చేసింది అన్నారు.కుమారప్ప కమిటీ & సచార్ కమిటీ నివేదిక ప్రకారం క్రైస్తవ దళితులలో 75% పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరు విద్య, ఉపాధి రంగాల్లో తీవ్రంగా వెనుకబడి ఉన్నారుఅన్నారు.​కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సవరించి, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, విద్యార్థులకు ఎస్సీలతో సమానంగా స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సదుపాయాలు కల్పించాలి.​మతం మారిన దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఎస్ సి/ఎస్ టి అట్రాసిటీ చట్టంను వారికి కూడా వర్తింపజేయాలి అన్నారు.న్యాయం అనేది మతానికి బందీకాకూడదన్నారు.ఈ  కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పడగ వెంకటరమణ, జిల్లా కోశాధికారి కృప, ఏరియా అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ పెంచలయ్య దళిత నాయకులు పాల్గొన్నారు

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular