📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetటీజీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం,రైతు భరోసా నిధుల విడుదల,రిఫైనరీతో పాటు పలు కీలక అభివృద్ధి...

టీజీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం,రైతు భరోసా నిధుల విడుదల,రిఫైనరీతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట్, మార్చి 22, ప్రజావాణి

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్వహించిన “రైతు ఉత్సవాలు” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్రప్రభుత్వానికి హృదయపూర్వకధన్యవాదాలుతెలియజేస్తున్నాను.ఈ సందర్భంగా టీజీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం రాష్ట్ర అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ కార్యక్రమాలు రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు దోహదపడతాయి.రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి నిబద్ధత మరోసారి స్పష్టమైంది. రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తూ, జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడం అభినందనీయం.రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఈ విధానాలకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ రైతాంగానికి మేలు చేసే ఈ కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రతి రైతు కుటుంబానికి లబ్ధి చేకూరాలనిఆకాంక్షిస్తున్నాను.ఈ సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి కి, సంబంధిత శాఖల అధికారులకు, కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular