📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్టిడిపి కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

టిడిపి కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి24మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.టిడిపి కౌన్సిలర్ల పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా టిడిపి కౌన్సిలర్లకు శాలువా,పూలమాలతో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమే మైదుకూరు వైపు చూసేలా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.రాష్ట్రంలో కేవలం రెండు చోట్ల మాత్రమే టిడిపి గెలుపొందింది.మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపికి 12 సీట్లు వైసిపికి 11 సీట్లు వచ్చాయి.ప్రజల గెలిపించిన వైసిపి నాయకులు దౌర్జన్యంతో టిడిపి కౌన్సిలర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారు.అక్రమ కేసులు బనాయించారు.తాడిపత్రిలో ఎమ్మెల్యే అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందారు.కానీ మైదుకూరులో టిడిపి నాయకుడు ధనపాల జగన్ ను నిలబెట్టి గెలుపొందాము.టిడిపి కౌన్సిలర్ ను అక్రమంగా తీసుకెళ్లి వైసిపి గెలుపొందింది.ఎన్ని ప్రలోభాలు పెట్టిన టిడిపి కౌన్సిలర్లు గట్టిగా లొంగకుండా నిలబడ్డారు.ఐదవ వార్డు కౌన్సిలర్ ఈ శుభ సందర్భంలో మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.అనంతరం ఎమ్మెల్యే ను శాలువా పూల మాలతో సత్కరించి స్వీట్ తినిపించిన కౌన్సిలర్ లు నాయకులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular