📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialజగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 900 మంది పోలీస్ లతో భద్రతా ఏర్పాట్లు పూర్తి...

జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 900 మంది పోలీస్ లతో భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్*

📰 Generate e-Paper Clip

ఎన్నికల నిర్వహణకు 9వందల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు పూర్తి

 

జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్

 

ఎన్నికలు జరిగే ప్రదేశంలో 144 సెక్షన్

 

 

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఫిబ్రవరి 10 (ప్రజావాణి):

 

 

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బందితో జిల్లా కేంద్రంలోని BLN ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధులకు సంబందించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల ప్రాముఖ్యతను వివరిస్తూ, ఎన్నికల విధులు ఏవిధంగా పకడ్బందీగా నిర్వహించాలి అని, సిబ్బంది చేయవలసిన, చేయకూడాని విధుల గురించి జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. జగిత్యాల, రాయికల్, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 136 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు, ఇందుకోసం 379 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల కోసం 900 మంది పోలీస్ సిబ్బందిని నియమించబడినట్లు పేర్కొన్నారు. పోలింగ్ సామగ్రిని పటిష్ట ఎస్కార్ట్‌తో పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు 45 రూట్లలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భద్రతా చర్యలలో భాగంగా 4 గురు డీఎస్పీలతో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 11 మంది సీఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, అలాగే ఎస్‌ఐల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల విధి విధానాలపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు రఘు చందర్ సి ఐ లు కరుణాకర్, సుధాకర్, రవి, రామ్ నరసింహారెడ్డి, ఆర్ ఐ లు వేణు, ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular