*”జగిత్యాల”ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా….!*
—జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
*రాయికల్:ఫిబ్రవరి (ప్రజావాణి)*

రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని,పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో 10 లక్షల నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వీరాపూర్ అనుబంధ గ్రామాలకు అదనపు బస్సు కోసం వినతి పత్రం సమర్పించగా రవాణా శాఖ మంత్రితో మాట్లాడి అదనపు బస్సు సర్వీసులు పునరుద్ధరణ కు కృషి చేస్తా అన్నారు.గ్రామంలో నీటి లీకేజీ సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో,పంచాయతీ కార్యదర్శుల కు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి 10 లక్షల చొప్పున రెండు,ఒకటి 30 లక్షల గోదాం మంజూరు చేయటం జరిగిందని వాటిలో గోదాం, మహిళ సంఘం, కమ్యూనిటీ ఆక్టివిటీ భవనం ఉన్నాయని అన్నారు.మహిళలకు నిధులు సక్రమంగా ఉపయోగపడాలని గత 2025 జనవరిలో
ఐఏఎస్ సృజన ను హైదరాబాద్ లో కలిసి మహిళా సంఘం, గోదాం పై వినతి పత్రాన్ని ఇవ్వగానేడు రాష్ట్ర స్థాయిలో
మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు.నిరంతరం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేయటం జరిగిందని,గ్రామాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి కల్పన కోసం అధికార ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని,మహిళలు,రైతులు,యువత అందరూ నాకు అండగా ఉండండి జగిత్యాలను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు రాష్టానికి భారంగా మారాయని,కేంద్ర నిధుల్లో సంఘం భవనాల నిర్మాణం చేస్తేనే రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయింపు చేశారని అన్నారు. ఎంజిఎన్ఆర్ ఈజిఎస్ పేరు మార్చి విబి జి రామ్ జీ గా పెట్టి కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నాయని,పేరు మార్పు పై నాకు ఎలాంటి అభ్యంతరం లేదని
కేంద్రం ఈ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు.బీద మధ్యతరగతి,భూమిలేని ఉపాధి కూలీలు కోసం తెచ్చిన పథకాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తుందని,తెలంగాణ రాష్ట్ర కూలీల పక్షాన విబి జీ రామ్ జీ పథకాన్ని పూర్తిగా ఖండిస్తున్నానని,తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి జీఎస్టీ రూపంలో పన్నులు చెల్లిస్తే రాష్టానికి హక్కుగా రావాల్సిన 40 శాతం నిధుల్లో నిబంధనలు పెట్టడం సరికాదని అన్నారు.జిల్లా కేంద్రంలో 4 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం దాదాపు పూర్తి కావచ్చిందని మహిళలకు ఉపయోగమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బింగి చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున,సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి,ఉప సర్పంచ్ దుంపల నర్సారెడ్డి,మాజీ ఫాక్స్ చైర్మన్ రాజరెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండపెల్లి రవీందర్ రావు,మాజీ ఏఎంసీ చైర్మెన్ గన్నె రాజరెడ్డి,సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్,సురేందర్ నాయక్, ముఖేద్,తిరుపతి గౌడ్,మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బెజ్జంకి మోహన్,ఏఈ ప్రసాద్,ఏపిఎం నరహరి, మాజీ సర్పంచులు,నాయకులు, అధికారులు మహిళలు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.




