సిద్దిపేట జిల్లా,హుస్నాబాద్, మార్చి 25, ప్రజావాణి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతం నుండి బుధవారం రోజున హైదరాబాద్ సమాచార భవన్ ముందు తలపెట్టిన జర్నలిస్టు పోరాట హక్కుల కొరకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి హుస్నాబాద్ ప్రాంతం నుండి జర్నలిస్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మిత్రులు తరలి వెళ్లారు.ఈ ఈ సందర్భంగా టి డబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై వివక్ష నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జర్నలిస్టుల చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో నడుస్తున్న చిన్న మధ్యతర పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని, అడ్వర్టైజ్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలని, జర్నలిస్టులకు అక్క్రెడిటెషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వాలని చిన్న మధ్య తరహా పత్రికలను ఎంఫానాల్మెంట్ చేర్చాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని,సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పందులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై నిర్లక్ష్యం కొనసాగితే చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సత్తు మహిపాల్ రెడ్డి, టి డబ్ల్యూ జేఎఫ్ కోఆర్డినేటర్ బాబురావు కేంద్ర కమిటీ సభ్యులు వరయోగుల మురళీధర్ స్వామి జిల్లా కార్యదర్శి మహ్మద్ ఖుద్రత్ అలీ ఉపాధ్యక్షుడు ఆకుల రాజు సభ్యులు చిట్టెంపెల్లి శ్రీనివాస్ రాష్ట్ర నలుమూలల నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..




