📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు...

చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

📰 Generate e-Paper Clip

కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)బద్వేలు నియోజకవర్గం, బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఊరిబిండి మహేష్ రెడ్డి, పరిటాల వెంకట సుబ్బయ్య (ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్), దేవిరెడ్డి తులసి రెడ్డి గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular