📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliగోల్డుమెడల్ సాధించిన గాయిత్రి 

గోల్డుమెడల్ సాధించిన గాయిత్రి 

📰 Generate e-Paper Clip

గోల్డుమెడల్ సాధించిన గాయిత్రి

విద్యార్థులు

 

ప్రజవాణి పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

పెద్దపల్లి మార్చి 25

 

 

 

గాయత్రి విద్యానికేతన్

విద్యార్థులు సైన్స్ టాలెంట్

పరీక్షల్లో గోల్డ్ మెడల్స్ పంట

యూనిఫైడ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించన నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (2025–26) జనవరి నెలలో నిర్వహించబడింది. ఈ పరీక్షలో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.

ఫస్ట్ క్లాస్‌కు చెందిన టి. అభ్యన్ సాయి రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్ అందుకున్నారు. అలాగే మనిశ్వర్ సాయి రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్ పొందారు.అదేవిధంగా జి. ఆద్యశ్రీ, ఏ. సాయి నిహాల్, బి. జశ్వంత్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ మరియు సర్టిఫికెట్లు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి జశ్వంత్ మాట్లాడుతూ, ఇటువంటి పరీక్షలు నిర్వహించడం ఎంతో ఆనందకరమని, ఇవి తమలో విజ్ఞానాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ విజయాల సందర్భంగా గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు ఒలింపియాడ్స్ మరియు నేషనల్ లెవెల్ పరీక్షలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇటువంటి పరీక్షల ద్వారా విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించడం నేర్చుకొని ప్రతిభావంతులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. గోల్డ్ మెడల్స్ విద్యార్థులకు గుర్తింపు మరియు ప్రోత్సాహాన్ని తీసుకువస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ , కరెస్పాండెంట్ రజినీ దేవీ , ప్రిన్సిపాల్ విజయ్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించిన కోఆర్డినేటర్ ఉపాధ్యాయురాలు నవ్య కి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలియజేసారు విద్యార్థుల ఈ విజయాలతో గాయత్రి విద్యానికేతన్ మరోసారి తన విద్యా ప్రతిభను చాటుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular