ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)గుడివాడ అమర్నాథ్కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు.హైకోర్టులో అప్పీల్‌కు వెళ్తానన్నారు.2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక రైల్వే జోన్ కోసం గాంధీ విగ్రహం సాక్షిగా అమర్నాథ్ చేసిన వీరోచిత దీక్షా దక్షతకు ఎట్టకేలకు న్యాయస్థానం గుర్తింపునిచ్చింది.అప్పట్లో ఆత్మహత్యాయత్నం కేసు పెడితే,అది ప్రజాపోరాటం అని కలరింగ్ ఇచ్చారు.కట్ చేస్తే,అధికారంలోకి వచ్చాక ఆ జోన్ కోసం కనీసం ఒక ఎకరం భూమి కూడా కేటాయించకుండా కాలయాపన చేసి, ఇప్పుడు తీరిగ్గా కోర్టు మెట్లు ఎక్కి ఆరు నెలల శిక్షను గిఫ్ట్‌గా పొందారు.చూడచక్కని పోరాటం.అంతకంటే గొప్ప ఫలితం అని ఆయనపై సెటైర్లు పడుతున్నాయి.అప్పట్లో ధర్నా.ఇప్పుడేమో తిప్పలు అధికారంలో ఉన్న ఐదేళ్లు రైల్వే జోన్ ఊసే ఎత్తకుండా,విశాఖ పరిపాలనా రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపించడానికే సమయం సరిపోయింది.రైల్వే జోన్ కు భూమి కావాలనికేంద్రం అదే పనిగా అడిగినా ఇవ్వలేదు.పదేళ్ల పాటు ఈ వ్యవహారం సాగింది. భూమి ఇప్పించడానికి గుడివాడ అమర్నాథ్ ప్రయత్నించలేదు.రైల్వే జోన్ విషయంలో వైఫల్యం చెందినా,నాటి దీక్ష తాలూకు కేసు మాత్రం అమర్నాథ్ గారిని నీడలా వెంటాడింది.అప్పట్లో అమరవీరుడిలా బిల్డప్ ఇచ్చి,అధికారంలోకి వచ్చాక జోన్ ప్రాధాన్యతనే మర్చిపోయిన వైనం.ఇప్పుడు పడి న శిక్షతో బ్యాలెన్స్ అయిందని ప్రజలు నవ్వుకుంటున్నారు.ప్రజలు వేశారు ఒక శిక్ష.చట్టం వేసింది మరో శిక్ష చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికే ఎన్నికల్లో ఓటుతో డిపాజిట్ గల్లంతు చేసి పెద్ద శిక్షే వేశారు. ఇప్పుడు చట్టం కూడా తన వంతుగా ఆరు నెలల జైలు,ఐదు వేల జరిమానాను ఖరారు చేసింది.పాపం,రైల్వే జోన్ తీసుకువస్తానని నాడు చేసిన హడావుడికి,నేడు కూటమి ప్రభుత్వం జోన్ పనులు మొదలుపెడుతుంటే.. ఈయన మాత్రం కోర్టుల చుట్టూ,అప్పీళ్ల చుట్టూ తిరగాల్సి రావడం ఆయనను నవ్వులాట నాయకుడని చేస్తోంది.రాజకీయాల అమర్ కావ్యం!ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే దీక్షలు ప్రజల కోసమని నమ్మించి,అధికారంలోకి వచ్చాక అవే సమస్యలను గాలికొదిలేస్తే కాలం ఎలా బుద్ధి చెబుతుందో అమర్నాథ్ కి ఇప్పుడు అర్థమై ఉండాలి.రైల్వే జోన్ కోసం భూమి ఇవ్వడానికి మనసు రాలేదు కానీ,కోర్టు ఇచ్చిన శిక్షను మాత్రం తప్పించుకోలేకపోయారు.ఇప్పుడు పై కోర్టుకు వెళ్లినా,ప్రజల దృష్టిలో పడ్డ వైఫల్య ముద్ర ను చెరపడం సాధ్యం కాకపోవచ్చు.
గుడివాడ అమర్నాథ్కు ఆరు నెలల జైలు శిక్ష
0
11
RELATED ARTICLES
- Advertisment -




