గుగ్గిళ్ల గ్రామంలో డ్రైనేజి నిర్మాణ పనులకు భూమి పూజ
బెజ్జంకి, మార్చి 25(ప్రజా వాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు అయిన 15 లక్షల రూపాయల సిసి డ్రైన్ (మురుగునీరు)కాలువ పనులను గుగ్గిళ్ళ గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దుగ్యానీ లావణ్య,వార్డు సభ్యులు కొంకటి సంపత్, పంతంగి వెంకటేష్,దుశెట్టి రాజిరెడ్డి, పోతూ భూలక్ష్మి, కొంకటి కుమార్, గుగ్గిళ్ల లావణ్య,ర్యాకం అనిత,సీత రేణుక, పంచాయితీ కార్యదర్శి కొంపల్లి వంశీధర్, కారాబార్ అశోక్,ఫీల్డ్ అసిస్టెంట్ ర్యాకం రాజు,సీత సంతోష్, గుగ్గిళ్ళ రాజేష్,దుగ్యాని మోహన్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




