నంద్యాల ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13) ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్లియర్ వ్యూ లాసిక్ సెంటర్ పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు లో ఉన్న మాతృత్వ ఫెర్టిలిటీ సెంటర్ పై అంతస్తులో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ విజయ భాస్కర రెడ్డి ఏర్పాటు చేసిన క్లియర్ వ్యూ లాసిక్ సెంటర్ ను సోమవారం రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, రోటరీ మాజీ గవర్నర్ కల్లూరు రామలింగారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర రెడ్డి మాట్లాడుతూ కంటి అద్దాల అవసరం లేకుండా కంటిలో చేసే చికిత్స కోసం అత్యాధునిక లేజర్ లాసిక్ సెంటర్ ను నంద్యాలలో ఏర్పాటు చేశామని, నంద్యాలలో ఉన్న నేత్ర వైద్యులు అందరూ ఈ కేంద్రంలో కంటి అద్దాలు అవసరంలేని చికిత్సలు చేసుకోవచ్చని అన్నారు. రాయలసీమలో ఇది అత్యాధునిక రెండవ కేంద్రమని,రాష్ట్రం ఈ స్థాయి కేంద్రాలు నాలుగు మాత్రమే ఉన్నాయి అని తెలిపారు.ఈ అవకాశాన్ని నంద్యాల, కర్నూలు జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో కంటి అద్దాలు అవసరం లేని చికిత్స కోసం కోట్లాది రూపాయల విలువ చేసే పరికరాలతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేటు రంగంలో వైద్య కళాశాల ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రులలో నిష్ణాతులైన వివిధ రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని, నంద్యాల వైద్య కేంద్రంగా మారిందని అన్నారు. నంద్యాల వైద్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఆదర్శప్రాయంగా నిలిచారని అభినందించారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాలలో డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి కంటి అద్దాలు లేని చికిత్స కోసం కేంద్రం ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నంద్యాల ప్రజలు ఇప్పుడు అన్ని చికిత్సలు నంద్యాలలోనే అందుకుంటున్నారని,కర్నూలు,హైదరాబాదు లకు పోవడం బాగా తగ్గిపోయిందని అన్నారు.నంద్యాల వైద్యులు వ్యక్తిగతంగా,ఐఎంఏ ద్వారా వైద్య శిబిరాలు,సేవా కార్యక్రమాలు సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ తో పాటు, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ,రోటరీ మాజీ గవర్నర్ లు కల్లూరు రామలింగారెడ్డి, చిన్నపరెడ్డి, ఐఎంఏ నాయకులు డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ మధుసూదన రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ,డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ సునీత,డాక్టర్ శైలజ,డాక్టర్ హరిత,డాక్టర్ అరిఫా భాను,అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.
క్లియర్ వ్యూ లాసిక్ నేత్ర చికిత్సా కేంద్రం ప్రారంభించిన మంత్రి ఫరూక్..నంద్యాల వైద్య కేంద్రంగా రూపొందింది: మంత్రి ఫరూక్.
RELATED ARTICLES




