📰 Generate e-Paper Clip
గ్రామ అభివృద్ధికి ప్రజల సూచనలు కీలకం
సంక్షేమ పథకాలపై గ్రామసభలో చర్చ
సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ
తిరుమలాయపాలెం, ప్రజావాణి:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామసభను సర్పంచ్ గూడూరు ఉపేందర్, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశాన్ని చదివి వినిపించారు.. అనంతరం సర్పంచ్ గూడూరు ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను ప్రస్తావించగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.గ్రామసభ పంచాయతీ రాజ్ వ్యవస్థలో కీలక భాగమై, ప్రజల అభిప్రాయాలతో నిర్ణయాలు తీసుకునే వేదికగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పవన్, పల్లె దవఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిరీష, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఉప్పునూతల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు దంతాల బాలరాజు, కాంగ్రెస్ యువజన నాయకులు గూడూరు ఉమామహేశ్వర్,బీఆర్ఎస్ నాయకులు గుణగంటి లింగయ్య,ఉప సర్పంచ్ కొత్తపల్లి వినోద, వార్డు సభ్యులు అన్నం రజిత, ఎస్ కే యాకుబ్ పాషా, ధర్మపురి నాగరాజు, ధర్మపురి భవాని, గుండా ఆంజనేయులు, కొంగరి వీరాంజనేయులు గ్రామ పెద్దలు, అధికారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.