📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కలసపాడు హాస్పటల్‌కు డాక్టర్లు గైర్హాజరు... ఎవరి కోసం ఈ ఆసుపత్రి?

కలసపాడు హాస్పటల్‌కు డాక్టర్లు గైర్హాజరు… ఎవరి కోసం ఈ ఆసుపత్రి?

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి22)కడప జిల్లా కలసపాడు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు,నర్సుల నిర్లక్ష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి,ప్రస్తుతం బాధితుల వేదనకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆదివారం పేరుతో,లేదా విధుల పట్ల అలసత్వంతో,డాక్టర్లు సమయానికి హాజరుకాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మధ్యాహ్నం అయ్యే సరికి కూడా ఆసుపత్రిలో వైద్యులు కనిపించకపోవడంతో,చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైద్యులు,తమ బాధ్యతలను విస్మరించి వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.పేద ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్థోమత లేక,ప్రభుత్వ ఆసుపత్రులకే ఆశ్రయిస్తే అక్కడ కూడా నిర్లక్ష్యం ఎదురవుతుండటం బాధాకరం.ఈ పరిస్థితుల వల్ల చిన్న వ్యాధులు కూడా తీవ్రమవుతున్నాయని,సమయానికి వైద్యం అందక రోగులు ప్రాణాలపైనా ప్రమాదం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్లు విధుల్లో లేకపోతే మేమెక్కడికి వెళ్లాలి,పేదల ప్రాణాలకు విలువ లేదా?”అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి,విధులకు సరిగా రాని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి,డాక్టర్లు,నర్సులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే నిర్లక్ష్య వైఖరిని తక్షణమే అరికట్టకపోతే, పరిస్థితి మరింత విషమించవచ్చని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular