ప్రజావాణి న్యూస్ :(మార్చి07) రాజంపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజంపేట లోని *ప్రభుత్వ బి సి వసతి గృహాము నందు కరెస్పాండెడ్ గా వీధులు నిర్వహిస్తున్న ,శోభారాణి * అనే మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ,సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళామణులు సృష్టిస్తున్న విజయాలు మహిళల గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గృహిణిగానే కాకుండా వ్యవసాయం మొదలుకొని దేశ సరిహద్దుల్లో రక్షణ వరకు, అంతరిక్ష ప్రయోగాలలో విజయాలను సాధించే వరకు మహిళలు పోషిస్తున్న పాత్ర గణనీయమైనది. అటువంటి మహిళలను గుర్తిస్తూ జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారికి స్ఫూర్తి నివ్వడమే కాకుండా, వారు సాధించాల్సిన విజయాలను, పరిష్కరించాల్సిన సమస్యలను వారికి గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. ఉత్తమ మహిళా అవార్డ్ గ్రహీత P. శోభారాణి గారు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఉత్తమ మహిళా అవార్డ్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.అలాగే మో రే.లక్ష్మణ్ రావు గారు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో మందికి అనాధ శవానికి అంతక్రియలు,రక్తదాన శిబిరాలు,వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇ టువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయం అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ్ రావు గారు, కరెస్పాండెన్స్ P. శోభా రాణి గారు,అహమ్మద్ గారు,శుభాన్ గారు, , ఈశ్వర్ వర్ధన్ రెడ్డి గారు, అప్సర్ గారు, దాదాపీర్ గారు, జగన్ మోహన్ రెడ్డి గారు, సునిల్ కుమార్ రెడ్డి గారుమరియు విద్యార్థులు పాల్గొనారు.
ఓ మహిళా నీకు వందనం మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
0
10
RELATED ARTICLES


