వై ఎస్ ఆర్ కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్09)ఐ.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో బద్వేలు పట్టణం లోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన బద్వేలు అర్బన్ ఎస్.ఐ ఆర్.వి కొండారెడ్డి, సిబ్బంది,వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మైదుకూరు డి.ఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణ లో ఐ.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో బద్వేలు అర్బన్ పరిధిలోని లాడ్జీలు మరియు డార్మిటరీలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి,అక్కడ పరిస్థితులను పరిశీలించిన బద్వేలు అర్బన్ ఎస్.ఐ ఆర్.వి కొండారెడ్డి,సిబ్బంది,లాడ్జీల్లోనీ కార్యకలాపాలపై నిఘా.అసాంఘిక,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ.గంజాయి,ఇతర మత్తు పదార్థాల సరఫరా/ వినియోగం అరికట్టుట.రికార్డుల నిర్వహణ మరియు సీసీటీవీ కెమెరాలు పనితీరు పరిశీలన.గెస్టుల వివరాలు మరియు వారు లాడ్జిలో బసచేయుటకు గల కారణాలపై ఆరా.లాడ్జీల్లోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి,లాడ్జిలలో,డార్మిటరీ లలో బస చేసిన వ్యక్తుల వివరాలను పరిశీలించి,కొత్త వ్యక్తులు మరియు అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ,వారి వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ పరికరాల ద్వారా పరిశీలిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు.లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు,ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహిస్తున్నారా.సీసీటీవీ కెమెరాల నిర్వహణ సరిగా ఉన్నదా.అని ఆరా తీసి,సరైన గుర్తింపు కార్డులు/ఆధారాలు ఉన్నవారికి మాత్రమే రూములను ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారికి ఎవరికీ రూముల ఇవ్వరాదని,లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసుల వారికి అందించాలని,డార్మిటరీస్,లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లాడ్జీల నిర్వాహకులకు బద్వేలు అర్బన్ ఎస్.ఐ ఆర్.వి కొండారెడ్డి హెచ్చరించారు.ఐ.పి.ఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టర్లకు,ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి లాడ్జి నిర్వాహకులు గదులు అద్దెకు ఇవ్వకూడదని, ఇస్తే లాడ్జి నిర్వాహకులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బద్వేలు అర్బన్ ఎస్.ఐ ఆర్.వి కొండారెడ్డి హెచ్చరించారు.జిల్లా పోలీస్ కార్యాలయం,కడప.
Homeఆంధ్రప్రదేశ్ఐ.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో బద్వేలు పట్టణం లోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన బద్వేలు...
ఐ.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో బద్వేలు పట్టణం లోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన బద్వేలు అర్బన్ ఎస్.ఐ ఆర్.వి కొండారెడ్డి
0
14
RELATED ARTICLES


