కడపజిల్లాలోనిప్రజావాణిన్యూస్(మార్చి26)మైదుకూరు,బ్రహ్మంగారి మఠం మండలాల సరిహద్దుల్లోని పది సంవత్సరాలుగా నల్లమల అభయారణ్యంలో.ఎద్దు అడుగు కణం మరియు మిట్టమాను పల్లె అటవీ మార్గం వరకు మేము సాగిస్తున్న ఈ ప్రయాణం కేవలం సేవ కాదు,వన్యప్రాణులపై మాకున్న ప్రేమతో ఈ మండు వేసవిలో మన ఇంటి లోపల ఉన్నా ఫ్యాన్లు,కూలర్లు లేనిదే ఉండలేకపోతున్నాం. మరి ఎండలు అగ్నిగోళాల్లా మారుతున్న వేళ,నిలువ నీడ దొరకని ఆ మూగజీవాల పరిస్థితి ఏమిటి? చెరువులు ఎండిపోయి,సెలయేళ్లు అడుగంటిన అడవిలో.గొంతు ఎండిపోయి, ఆకలి దప్పికలతో అలమటిస్తున్న వన్యప్రాణుల ఆవేదనను నేస్తం సేవా సంస్థ తీరుస్తుంది.బుధవారం సాయంత్రం బైకుపై బిందెలతో నేస్తం సేవా సంస్థ ఏర్పాటు చేసిన నీటి తొట్టెలకు నిండుగా నీరు పోసి రావడం జరిగింది.ఈ పుణ్య కార్యక్రమములో,పిప్పళ్ళ బాలనాగిరెడ్డి, RB వెంకటరెడ్డి,సూర్య నాయుడు,కొమ్మ బ్రాహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.మీ ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ.మీ.నేస్తం సేవా సంస్థ, మైదుకూరు.
Homeఆంధ్రప్రదేశ్ఎండ వేడిని సైతం లెక్కచేయకుండా మూగజీవాల సేవా చేస్తున్న మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యులు...
ఎండ వేడిని సైతం లెక్కచేయకుండా మూగజీవాల సేవా చేస్తున్న మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యులు…
0
7
RELATED ARTICLES
- Advertisment -




