ప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)ఆర్.టి.ఈ అడ్మిషన్స్ ను తిరస్కరిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి:ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.విద్యాహక్కు చట్టం (ఆర్.టి.ఈ) అడ్మిషన్స్ ను తిరస్కరిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక ఓంశాంతి నగర్ లోని ఏ.ఐ.ఎస్.బి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.విద్యాహక్కు చట్టం (ఆర్.టి.ఈ) 2009 ప్రకారం పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలలో 25% ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నీరుగారుస్తున్నాయని వారు అన్నారు.2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆర్.టి.ఈ కింద మొదటి విడత గా అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసి పాఠశాలలకు సైతం ఎంపికైన విద్యార్థుల లిస్ట్ పంపించారని వారు తెలిపారు. అయితే ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం ఆర్.టి.ఈ కింద అడ్మిషన్ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆంక్షలు పెట్టి అడ్మిషన్ తిరస్కరిస్తున్నారని వారు తెలిపారు. ఆన్ లైన్ లో అప్లై చేసిన వారికి ఎలిజిబులిటీ లిస్ట్ లో విద్యార్థి ఎంపిక అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు మాత్రం ఆంక్షలు పెట్టి అడ్మిషన్స్ ను తిరస్కరిస్తున్నారని వారు అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు విద్యార్థి ఎంపిక అయిన కూడా అడ్మిషన్ కన్ఫర్మ్ చేయకుండా తిరస్కరిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆర్.టి.ఈ కింద ప్రైవేట్ పాఠశాలలకు ఎన్ని సీట్లు కేటాయించారు ఎంతమంది విద్యార్థులకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేశారో వివరాలను విద్యాశాఖ అధికారులు విచారించాలని వారు తెలిపారు.ఆర్.టి.ఈ అడ్మిషన్స్ ను తిరస్కరించి అడ్మిషన్ ఇవ్వని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏ.ఐ.ఏ.బి నాయకులు అఖిల్, చింటూ లు పాల్గొన్నారు.
ఆర్.టి.ఈ అడ్మిషన్స్ ను తిరస్కరిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి;;ఏ.ఐ.ఎస్.బి
0
21
- Advertisment -



