ప్రజావాణి న్యూస్ :(మార్చి 07) పోరుమామిళ్ల నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపాల్ శామ్యూల్ డేవిడ్ రాజ్ మరియు పురుష అధ్యాపక బృందం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని వారి ఔన్నత్యాన్ని వారి త్యాగ సేవా నేర్పిని కొనియాడుతూ సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు డాక్టర్ సబితా పర్వీన్ మరియు దివ్య యొక్క సేవలను అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా అధ్యాపకులు వెంబడి ఈశ్వరయ్య మహిళలపై రాసిన అభ్యుదయ కవితను చదివి వినిపించారు సమావేశ అనంతరం కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేడీస్ వెయిటింగ్ హాల్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ లేడీస్ వైటింగ్ హాల్ ని శుభ్రంగా ఉంచుకోవాలని మహిళా విద్యార్థుల కోసం ఏకంగా ఏర్పాటుచేసిన ఈ గదిలో ఒక కంప్యూటర్ను మరియు నెట్ సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ వెంకటరావు హరి డాక్టర్ హరిబాబు డాక్టర్ నరసింహారెడ్డి రవిచంద్ర డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ నగేష్ గిడియోన్ బాబు మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు
అమ్మాయిలో అనే పదంలోనే అమ్మ ఉంది, డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్
0
31
RELATED ARTICLES
- Advertisment -




