ప్రజావాణి న్యూస్ (మార్చి 07) పెండ్లిమర్రి జూనియర్ కళాశాలలో అబ్జర్వార్ పై దాడిచేసిన ప్రిన్సిపల్ ఇందిర పై వెంటనే ఎస్.సి, ఎస్.టి అల్ట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి), ప్రగతిశీల విద్యార్థి సంఘం (పి.ఎస్.యూ) ఆధ్వర్యంలో కడప ఇంటర్మీడియట్ విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్.జే.డి) వారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్, పి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి ధార గోపి లు మాట్లాడుతూ.పెండ్లిమర్రి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలలో డిపార్ట్ మెంట్ అబ్జర్వార్ గా విధులు నిర్వహిస్తున్న భూత లింగేశ్వర రావు గారిపై అదే కళాశాల ప్రిన్సిపల్ ఇందిర దాడిచేసి కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. పరీక్షల విధులలో ఉన్న అబ్జార్వర్ ఎస్.టి కులానికి చెందిన వారు కావడంతో అగ్రవర్ణాలకు చెందిన ప్రిన్సిపల్ ఇందిర దాడిచేయడం హేయమైన చర్య అని వారు తెలిపారు. దాడి జరిగి పది రోజులు అవుతున్నా ఇంతవరకు ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు ప్రిన్సిపల్ ఇందిరా కు వాత్తాసుపలుకుతూ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. గతంలో కూడా ప్రిన్సిపల్ ఇందిర కళాశాలలో లెక్సరర్స్ పై, విద్యార్థులపై దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. అయినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రిన్సిపల్ ఇందిరా ను సస్పెండ్ చేసి, ఎస్.సి, ఎస్.టి అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సుమంత్, అంజి, పండు, చైతు, నాని, చింటూ లు పాల్గొన్నారు
Homeఆంధ్రప్రదేశ్అబ్జర్వర్ పై దాడిచేసిన ప్రిన్సిపల్ ఇందిర ను వెంటనే సస్పెండ్ చేయాలి: ఏ.ఐ.ఎస్బి పి....
అబ్జర్వర్ పై దాడిచేసిన ప్రిన్సిపల్ ఇందిర ను వెంటనే సస్పెండ్ చేయాలి: ఏ.ఐ.ఎస్బి పి. ఎస్ .యు
0
12
RELATED ARTICLES
- Advertisment -




