ప్రజావాణి న్యూస్:(మార్చి 11) రాయచోటి,30 మండలాల నుండి ఉపాధ్యాయుల పాల్గొనడం – విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల మెరుగుదలే లక్ష్యం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం మరియు మదింపు విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా అన్నమయ్య జిల్లాలో రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. రాయచోటిలోని అర్చన కాలేజీలో ఈకార్యక్రమంనిర్వహించబడుతోంది.జిల్లాలోని 30 మండలాల నుండి ప్రతి మండలం నుంచి ఇద్దరు ఎంఈఓలు, ఇద్దరు సీఆర్‌సీ హెడ్‌మాస్టర్లు, ఇద్దరు ఎస్జీటీలు మరియు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు చొప్పున మొత్తం 8 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యార్థుల మదింపు ప్రమాణాలను మెరుగుపరచడం మరియు ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించడం ఈ వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసనంలో ఉన్న లోపాలను గుర్తించి వాటికి తగిన పరిష్కారాలను కనుగొనే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా 3, 6, 9 తరగతుల విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను సమగ్రంగా అంచనా వేయడంలో ఈ వర్క్‌షాప్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.సెక్రటరీ గంగాధరం మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా, పాఠాలలోని భావనలను లోతుగా అర్థం చేసుకునే విధంగా బోధన జరగాలని తెలిపారు. అభ్యాస ప్రక్రియలో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అసదుల్లా భాష మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రమాణాలను విశ్లేషించేందుకు మరియు విద్యార్థుల అభ్యాసంలో ఉన్న బలహీనతలను గుర్తించేందుకు ఈ వర్క్‌షాప్‌లు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. డేటా ఆధారిత విశ్లేషణ ద్వారా విద్యను మెరుగుపరచడానికి అవసరమైన సమాచారం అందుతుందని పేర్కొన్నారు.ఈ శిక్షణా కార్యక్రమం రెండు రోజులపాటు నాన్-రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించబడుతోంది. ఇందులో ఉపాధ్యాయులకు మదింపు విధానాలు, అభ్యాస ప్రమాణాలు, విద్యార్థుల సామర్థ్యాల అంచనా వంటి అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు, గ్రూప్ చర్చలు మరియు కార్యాచరణ ప్రణాళికలు చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, గిరిబాబు యాదవ్, శ్రీనివాసులు పద్మావతి, శివలక్ష్మి మరియు గోపికృష్ణ మాస్టర్ ట్రైనర్లు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
అన్నమయ్య జిల్లాలో ఉపాధ్యాయుల మదింపు పై రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభం
0
17
RELATED ARTICLES
- Advertisment -




