📄 ePaper
Monday, April 6, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarఅనుమతి లేని ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సమయంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్ నంబర్ టీఎస్ 02 టి 1190ను ఆపి తనిఖీ చేయగా, యజమాని-డ్రైవర్ జల్లా మహేందర్ (గంగిరెడ్డిపల్లి గ్రామం)గా గుర్తించారు.అలాగే టీఎస్ 02 యు డి 9326 ట్రాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రాక్టర్ యజమాని బురికీ సందీప్ కాగా, డ్రైవర్ ముక్కర అనిల్ (ఇందుర్తి గ్రామం)గా గుర్తించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నేపథ్యంలో రెండు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పృధ్వీధర్ గౌడ్ తెలిపారు.అక్రమ ఇసుక రవాణాపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. అక్రమ రవాణా కొనసాగిస్తే వాహనాలను స్వాధీనం చేసుకుని మరింత కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular