📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అటవీ సిబ్బందికి నూతన సర్వే విధానాలు, అటవీ అగ్ని నివారణపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహణ

అటవీ సిబ్బందికి నూతన సర్వే విధానాలు, అటవీ అగ్ని నివారణపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహణ

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్  (మార్చి 7) కడప:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో కడప జిల్లాలో అటవీ సిబ్బందికి సర్వే విధానాలు, ఆధునిక సర్వే సాంకేతికతలు మరియు వేసవి కాలంలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ఐఎఫ్ఎస్సి    ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది.కడప జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ ఐ.ఎఫ్ఎస్సి  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో అటవీ శాఖతో పాటు ఫైర్ డిపార్ట్‌మెంట్ మరియు సర్వే డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాల పరిరక్షణలో సర్వే ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా ఆధునిక సర్వే సాంకేతిక పద్ధతులు, జీపీఎస్ ఆధారిత మ్యాపింగ్, డిజిటల్ డేటా సేకరణ వంటి అంశాలపై అటవీ సిబ్బందికి ప్రాక్టికల్ మార్గదర్శకాలు అందించారు. వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో అటవీ అగ్ని ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం, నివారణ చర్యలు తీసుకోవడం, ఫీల్డ్ స్థాయిలో సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.


అటవీ అగ్నిప్రమాదాల సమయంలో ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం ఎలా ఉండాలో, అటవీ ప్రాంతాల్లో పర్యవేక్షణను ఎలా బలోపేతం చేయాలో నిపుణులు సిబ్బందికి వివరించారు. అటవీ సంపదను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అటవీ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ ఐ.ఎఫ్ఎస్సి  గారు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి  ఫైర్ ఆఫీసర్ బసివి రెడ్డి గారు మరియు ఇతర సిబ్బండి .మరియు సర్వే డిపార్ట్‌మెంట్ నుంచి శివ ప్రసాద్ & బాలాజీ గారు ఇతర అధికారులు పాల్గొన్నారు,అటవీ శాఖకు సబ్.డి.ఎఫ్.ఓప్రొద్దుటూరు బద్వేల్ , ఫారెస్ట్ రేంజ్ అధికారుల నుంచి ఏబీఓల వరకు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా అటవీ పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సిబ్బందికి అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular