అక్రమ దందా.. అనుమతులు లేని వ్యాపారం. రెచ్చిపోతున్న.. ఆ శ్రీకృష్ణుడు
చింతకాని మండలంలో ఆయన లీలలు పట్టించుకునే అధికారి లేకపాయే..!
ఎంత పోటీ ఉన్నప్పటికీ ఇంత లాభం ఉంటే.. ఆయన ఇచ్చు మామూళ్లకు కక్కుర్తి . ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మామూళ్ల మత్తులో జోగుతున్నారా..?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని నాగులవంచ బోనకల్ మండలంలో ఉన్నటువంటి వైన్ షాపులు అక్రమంగా నడుస్తున్నప్పటికీ చింతకాని బోనకల్లు మండలం కు చెందిన కొందరు కార్పొరేట్ శక్తులకు లంచాలు ఇస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. బెల్ట్ షాపులకు అనుమతి లేదు . ఎమ్మార్పీ రేటు కంటే అధికంగా అమ్మకూడదు అనేది నిబంధన. అవినీతికి అలవాటు పడిన కొందరు ఏ దుకాణం లేని వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి అక్రమ మద్యం వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని పలువురు చింతకాని బోనకల్ మధిర ఖమ్మం రూరల్ అర్బన్ ప్రజలు కోరుతున్నారు.




