*అంగన్వాడీ కేద్రాల పై పర్యవేక్షణ కరువు*
*సమయపాలన పాటించని కమ్మరి కత్త అంగన్వాడి కేంద్రం*
టేక్మాల్ ఫిబ్రవరి 17: (మన ప్రజావాణి) అల్లాదుర్గ్ ప్రాజెక్ట్ టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట సెక్టార్ పరిధిలో కమ్మరికత్త అంగన్వాడి కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడి కేంద్రం ఉండాల్సిందిగా మూడు గంటలకి అంగన్వాడి సెంటర్ కు తాళం వేసి వెళ్ళిపోయారు .అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ ఉండాల్సి ఉండగా, మూడు గంటలకే వెళ్ళిపోతున్నారు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు చదువులు ఎలా కొనసాగుతాయని స్థానిక ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు, సూపర్ వైజర్ అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
*వివరణ:* పై విషయమై ఎల్లుపెట్ సెక్టార్ సూపర్వైజర్ నిహారికను ప్రజావాణి ప్రతినిధి వివరణ కోరగా సాయంత్రం నాలుగు గంటల వరకు సమయపాలన పాటిస్తుంది అని అనుకున్న కానీ మూడు గంటలకి మూసి వేసి వెళ్ళిపోతుందని నాకు తెలియదు అని సమాధానం తెలియజేసింది. అంగన్వాడి సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సూపర్వైజర్ అన్నారు




