PGRS ఫిర్యాదులను అత్యధిక ప్రాధాన్యత తో నిర్ణీత గడువు లోగా చట్ట పరిధిలో పరిష్కరించాలి – జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్
వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 160 ఫిర్యాదులు PGRS కు వచ్చాయి.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు....