“O-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి” -బెజ్జంకి మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి

బెజ్జంకి,జూన్ 28 (ప్రజావాణి) పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలోని బెజ్జంకి మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి ఆధ్వర్యంలోని మొబైల్ వైద్య బృందం పీహెచ్‌సీ పరిధిలోని చేరుకోవడానికి కష్టంగా ఉన్న ప్రాంతాలైన పౌల్ట్రీ ఫామ్‌లు, ఇటుకల కర్మాగారాలను సందర్శించి ఐదేళ్లలోపు చిన్నారుల దగ్గరకి వెళ్లి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధురి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల వయసు గలవారు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రతి...