prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 2:22 pm Digital Edition : RAJASHEKARREDDY

“O-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి” -బెజ్జంకి మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి

బెజ్జంకి,జూన్ 28 (ప్రజావాణి)

పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలోని బెజ్జంకి మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి ఆధ్వర్యంలోని మొబైల్ వైద్య బృందం పీహెచ్‌సీ పరిధిలోని చేరుకోవడానికి కష్టంగా ఉన్న ప్రాంతాలైన పౌల్ట్రీ ఫామ్‌లు, ఇటుకల కర్మాగారాలను సందర్శించి ఐదేళ్లలోపు చిన్నారుల దగ్గరకి వెళ్లి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధురి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల వయసు గలవారు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి రెండు చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని,ఒక్క చిన్నారి కూడా టీకాలకు దూరం కాకుండా ప్రతి చిన్నారిని గుర్తించి పోలియో చుక్కలు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డాక్టర్ మాధురి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.