MTF స్కాలర్‌షిప్ ప్రోగ్రాం పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి
పోరుమామిళ్ల,జూన్2 ప్రజావాణి విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందించే లక్ష్యంతో మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న MTF స్కాలర్‌షిప్ ప్రోగ్రాం పోస్టర్‌ను ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన అనాధలు మరియు తండ్రిని కోల్పోయిన విద్యార్థులకు విద్యా పరంగా అండగా నిలవడం అభినందనీయమైన సేవ అని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు.మదర్ థెరెసా ఫౌండేషన్ చైర్మన్ చిత్తా రవి ప్రకాశ్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో...