prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 3:13 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

GRT GVK ఇంగ్లీష్ మీడియం స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు

ప్రజావాణిన్యూస్(మార్చి21)​కడప స్థానిక చిన్నచౌక్ పరిధిలోని రాయల్ గార్డెన్‌లో శనివారం సాయంత్రం GRT GVK ఇంగ్లీష్ మీడియం స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మరియు టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు విచ్చేశారు.వారికి స్కూల్ యాజమాన్యం నరసింహులు శంకర్,రజని దంపతులు ఘనస్వాగతం పలికారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉన్నత అవకాశాలను వదులుకొని ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేసిన శంకర్,రజని గార్ల కృషి అభినందనీయమన్నారు.నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం మార్కుల కోసమే కాకుండా,నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. క్రమశిక్షణ,పట్టుదల ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని ఆయన పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రసాద్ బాబు గారు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వ్యాపారవేత్త అతికారి కృష్ణ గారు,డాక్టర్ రబ్బాని గారు ,పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.