జిల్లా తైక్వాండో పోటీల్లో అచీవర్ అకాడమీ సత్తా …… 6 స్వర్ణాలు, 2 కాంస్య పతకాలతో రాష్ట్ర స్థాయికి పలువురు క్రీడాకారుల ఎంపిక

హైదరాబాద్, జూలై 27 (ప్రజావాణి): మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాంపల్లిలోని పిట్ జోన్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026లో అచీవర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 40వ సబ్‌జూనియర్ క్యోరుగి, 14వ సబ్‌జూనియర్ పూమ్సే, 43వ జూనియర్ క్యోరుగి, 16వ జూనియర్ పూమ్సే విభాగాల్లో జరిగిన ఈ పోటీలు రానున్న తెలంగాణ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు జిల్లా ఎంపిక పోటీలుగా నిర్వహించారు. అచీవర్ తైక్వాండో అకాడమీ నుంచి 13 మంది క్రీడాకారులు పాల్గొనగా, మొత్తం 6...