prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 2:28 am Digital Edition : RAJASHEKARREDDY

*_కాళేశ్వరం విషయంలో కేసీఆర్ హరీష్ రావులకు హైకోర్టులో ఊరట_ఇది యావత్ తెలంగాణ ప్రజల విజయం_ బీఆర్ఎస్ యువ నాయకుడు ముక్కిస అంజిరెడ్డి

 

బెజ్జంకి, ఏప్రిల్ 23(ప్రజావాణి )

…కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు గౌరవ హైకోర్టులో ఊరట లభించడం పట్ల *బీఆర్ఎస్*
*యువనాయకుడుముక్కిసఅంజిరెడ్డి గారుహర్షం వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విజయం కేవలం పార్టీది మాత్రమే కాదని మొత్తం తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్పందించిన హైకోర్టు ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ తన విచారణలో ఎలాంటి కనీస నిబంధనలు పాటించలేదని ఆయన విమర్శించారు. 2025 జూలైలో ప్రభుత్వం సమర్పించిన ఈ రిపోర్ట్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లేందుకే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయ కక్షతో ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు సత్యం ఎప్పుడూ జయిస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సాధించిన ప్రగతిని ఎవరూ చెరిపివేయలేరన్నారు..